Atchannaidu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు సూచించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నేటి (ఆదివారం) ఉదయం అల్పపీడన ప్రభావం, పంట నష్టం, ఎరువుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో ప్రధానంగా చర్చించారు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి తెర పైకి ప్రతిపక్ష నేత హోదా రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటోన్న అధికార పక్షం.. ఇప్పటి వరకు జరగని అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపని స్పీకర్..
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను కలసి.. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నారు.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు.
MPDO Missing Mystery: గత ఆరు రోజుల నుంచి ఎంపీడీవో వెంకటరమణ ఏమయ్యారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన ఎంపీడీవో.. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల బకాయి చెల్లించటం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు శాకంబరీ దేవీగా దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Polavaram Floods: పోలవరం ప్రాజెక్టులోకి క్రమంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. స్పిల్ వేపైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని రిలీజ్ చేస్తున్నారు.