నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.
బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించి ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని.. రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Srisailam Project శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది..
ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్చింది. విద్యా వ్యవస్థలోని పలు పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు.
అనకాపల్లిలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.