చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆతర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు.
కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు.
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై జేసీబీల లోడుతో ఆగివున్న ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.