వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతేకాకుండా.. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.
గత ప్రభుత్వంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అక్రమాలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. 2019-24 మధ్య కాలంలో ఏవియేషన్ కార్పొరేషన్ లావాదేవీలపై ఆరా తీస్తోంది.. అప్పటి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి అక్రమాలపై త్వరలో విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు..
వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట..