వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
కోటి చెట్లు పెట్టాలని సంకల్పించామని.. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలని సూచించారు. మంగళగిరిలోని ఎకోపార్క్‌లో వనమహోత్సవాన్ని మొక్కలు నాటి ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయమన్నారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు రాగా.. వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి.
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.