CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. ఇలా అన్ని సమయాల్లోనూ ఆయన గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.. ఓ వైపు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూనే మరో వైపు.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది.. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు.. దాదాపు ఆరు గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో తిరిగారు.. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరిగాల్సి వచ్చింది..
Read Also: Upasana Kamineni Konidela: వెల్‌నెస్ ‘షార్క్’ – ఎంపరింగ్ విమెన్ ఎంటర్‌ప్రిన్యూవర్స్
సితార సెంటర్ నుంచి ఇతర ప్రాంతాల గుండా నున్న బైపాస్ రోడ్డుకు వెళ్లిన సీఎం కాన్వాయ్. ఆ తర్వాత సీఎంను ఎక్కించుకునేందుకు రామవరప్పాడు మీదుగా నున్న వెళ్లింది.. అయితే.. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే చంద్రబాబు పర్యటన కొనసాగింది.. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించిన సీఎం.. ఆహారం అందుతుందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై కూడా ఆరా తీశారు సీఎం.. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టూ పాయింట్ ఛేంజ్ అవుతూ సీఎం కాన్వాయ్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది..