వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగించింది.. వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో నాలుగోవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.. శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో 5 వందల మంది చెంచు ముత్తైదువులు.. వేయి మంది సాధారణ మహిళలు.. ఉచితంగా ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అవకాశం కల్పిస్తున్నారు..
దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలి.. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. ఇది సామాజిక బాధ్యత అంటూ పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పవన్ కల్యాణ్ కోరారు..
ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ విజయవాడకు వచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తోంది జత్వానీ. ప్రభుత్వం విచారణకు ఆదేశించటంతో ఈరోజు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును జత్వానీ కలుస్తుందని సమాచారం.