అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో అర్హులైన 200 మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది.. మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక లక్ష మందితో పెట్టొచ్చు.. ప్రజలను చూడటానికి వచ్చా తప్ప.. ఆర్భాటాలు.. హంగుల కోసం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఉదయభాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. వైఎస్సార్, జగన్కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. అలా అతిథులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..
అప్పుడు యువగళం... ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను…
తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆవేదన చెందాను అన్నారు.. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు