శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే…
రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను…
స్టీల్ ప్లాంట్‌న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే…
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.. వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా.. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. కొవ్వూరులో 34 యాక్ట్ కూడా అమలులో ఉందని.. పోలీసు పికెటింగ్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు..
ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉండగా.. 21వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే, పార్టీ మార్పు ప్రచారంపై సోషియల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు వైసీపీ నేత కేతిరెడ్డి. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు కేతిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానంటూ క్లారిటీ…
బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముందుగా నిర్ణయించిన ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేశారు.. అయితే, ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పర్యటనను ఖరారు చేశారు.. దీంతో. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాగులప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించనున్నారు..