అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన పెన్షన్ల గుర్తించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. కొందరు అనర్హులు కూడా సామాజిక పెన్షన్లు తీసుకొంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు.
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి, వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి అని సూచించారు.. చాలామంది మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.. ఇక, ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి.. వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి అని సలహా ఇచ్చారు..
హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సినీ నటి జత్వానీ.. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రికి వివరించాను. పోలీసులు నా విషయంలో.. నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా…
జెమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జెమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జెమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు.
ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నాం.. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం అన్నారు.. ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం అన్నారు..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.