Ambati Rambabu: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
Thota Trimurthulu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా?.. అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు, అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు అన్నారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు.. 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారు.. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని నా కుటుంబ సభ్యులకు చెందిన చెరువులు ధ్వంసం చేశారు..
Kilari Rosaiah: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో రోశయ్య, ఉదయ భాను సమావేశం అయ్యారు.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంత్ భగ్చితో కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఇటీవల ఢిల్లీలో స్టీల్ మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశాల వివరాలను కార్మిక సంఘాలతో అధికారులు చర్చించారు.
Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చిన ఎన్ని రోజులకి అమ్మఒడి ఇచ్చావు అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు..
వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడే నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..? మనం నిమిత్త మాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
విజయవాడ తూర్పు నియోజకర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 ఏళ్లు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోన్నర ఆయన.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు.. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో ఫోన్లో మాట్లాడి.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.