Nominated Posts: ఏపీలో నామినేటేడ్ పోస్టుల భర్తీ.. కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
- నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసిన చంద్రబాబు సర్కార్..
- వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్ల నియామకం..
- ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ..
- గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి..
- పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నేతలు చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం.. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
కార్పొరేషన్లు – ఛైర్మన్లు
1. వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
2. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)- అనిమిని రవి నాయుడు
3. AP హౌసింగ్ బోర్డు – బత్తుల తత్తయ్య బాబు
4. AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బోరగం శ్రీనివాసులు
5. AP మారిటైమ్ బోర్డ్ – దామచెర్ల సత్య
6. సీడప్ (ఏపీలో ఉపాధి కల్పన & సంస్థ అభివృద్ధి కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి
7. 20 పాయింట్ ఫార్ములా – లంక దినకర్ (BJP)
8. AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
9. AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి
10. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) – మంతెన రామరాజు
11. AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య
12. AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
13. APSRTC ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ.. APSRTC వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం
14. AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
15. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
16. AP స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
17. A.P. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
18. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
19. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) – వజ్జా బాబు రావు
20. AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (APTIDCO) – వేణుములపాటి అజయ కుమార్ (జనసేన)
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!