YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.. ఇక, రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో శ్వామలరావు.
సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన.. వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తన దీక్ష విరమించారు..
కొందరు 35 ఏళ్లు దాటి.. 40 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో.. ఏదో ఒక పిల్ల అయితే చాలని వెంటనే కమిట్ అవుతున్నారు.. 40 ఏళ్లకు పెళ్లి కుదరడంతో.. ఎగిరి గంతేసి.. వెనకాముందు చూడకుండా.. పెళ్లి చేసుకొని.. వారం రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో.. ఓ నవ వరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది.. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కల్యాణ్.