YS Jagan: రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి.. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను.. DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం.. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.. 2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్చామని గుర్తుచేసుకున్నారు జగన్..
Read Also: Viral video : అమ్మాయిలతో పాటు భరతనాట్యం చేసిన ఏనుగు.. వీడియో వైరల్
అయితే, మళ్లీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. విద్య, వైద్య శాఖలో అనేక మార్పులు వైసీపీ హయంలో వచ్చాయి.. ఇప్పుడు అన్నీ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయటం లేదన్న ఆయన.. రైతుల నుంచి దళారీలు ధాన్యం కొంటున్నారు.. 3 క్వార్టర్స్ పూర్తయినా విద్యా దీవెన బకాయిలు చెల్లించటం లేదు.. కళాశాలలో చదవాల్సిన విద్యార్థులు పొలాల్లో తల్లిదండ్రులతో ఉంటున్నారని మండిపడ్డారు.. వాలంటీర్లను మోసం చేశారు.. ఎన్నికల సమయంలో 10 వేలు ఇస్తామని గెలిచాక పక్కన పెట్టేశారని దుయ్యబట్టారు.. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం పెంచే విధానం.. వైసీపీ హయంలో ఇది జరిగింది.. 3 పోర్టులను ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం అన్నారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణం చేస్తోందంటూ ఆరోపించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..