కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు.
తాను పార్టీ మారుతానని కొన్ని మీడియా ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయా ఛానళ్లు తమ వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి హాజరుకావాల్సింది ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్.
నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. అయితే, మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని హెచ్చరించారు.. పిల్లల తప్పు కూడా ఉండదు... మనమే మానసికంగా సరిదిద్దాలని సూచించారు..
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ.. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం అన్నారు.. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు.. టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు.
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు..