Off The Record: గుర్తింపు లేనప్పుడు ఎందుకు..! ఫ్రస్ట్రేషన్‌లో తాడికొండ ఎమ్మెల్యే..
- ఫ్రస్ట్రేషన్‌లో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్..
- ప్లీజ్... నన్ను గుర్తించండని వేడుకోలు..
- అమరావతిలో కీలకం తాడికొండ నియోజకవర్గం..
- కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అసహనం..
- నేనున్నానని గుర్తించకుంటే ఎలాగని క్వశ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఎమ్మెల్యే… నియోజకవర్గానికి రారాజు లాంటివాడు. అందునా అధికార పార్టీ శాసనసభ్యుడు అయితే… ఆ లెక్కే వేరు. ప్రత్యేకించి అభివృద్ధి పనుల విషయంలో తన ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమన్నా నానా రచ్చ చేసే ఎమ్మెల్యేలకు కొదవే లేదు. కానీ…. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ పరిస్థితి మాత్రం రివర్స్‌లో ఉందట. ప్లీజ్… ఏం జరుగుతోందో నాకు చెప్పండి… లోకల్ ఎమ్మెల్యేగా నన్ను గుర్తించండి… అభివృద్ధి పనులకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వండంటూ ప్రభుత్వ పెద్దల్ని ప్రాధేయపడాల్సి వస్తోందట ఆయన. అమరావతి నిర్మాణం తిరిగి పట్టాలెక్కిన క్రమంలో అభివృద్ధి పనుల పరంగా తాడికొండ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. కానీ… పై స్థాయిలో జరిగిపోతున్న నిర్ణయాలు ఏవీ ఎమ్మెల్యేదాకా రావడం లేదట. తనకు కనీస సమాచారం లేకుండానే… లోకల్‌గా ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తుంటాన్ని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. కనీసం నేనున్నానని గుర్తించకుంటే ఎలాగంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారట ఆయన. ఎంత రాజధాని నిర్మాణం అయినా… పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నా… పెద్ద పెద్ద పనులు మొదలవబోతున్నా… నేకు కూడా ప్రజాప్రతినిధినే కదా… నాకు కనీస గుర్తింపు లేకుంటే ఎలాగంటూ… తాడికొండ ఎమ్మెల్యే సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరన్నా చొరవ తీసుకుని… అన్నా… అదేందీ… మనకు తెలియకుండా లోకల్‌గా ఏవేవో జరిగిపోతున్నాయి. ఇలాగైతే ఎలాగని అడిగితే…. మీరుండండ్రా బాబూ… నాకే అర్ధంగాక ఛస్తున్నా… నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం గురించి అయితే నాతో మాట్లాడండి, అభివృద్ధి పనుల ప్రస్తావన మాత్రం తీసుకురావద్దని తాడికొండ ఎమ్మెల్యే అంటున్నట్టు సమాచారం. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడాన్ని రీ టెండర్స్ పిలవబోతున్నారు. ఇక రుణాల సమీకరణ, పనుల్ని పరిగెత్తించడంపై ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళుతోంది ఏపీ సర్కార్. తాడికొండ నియోజకవర్గం పరిధిలో కూడా ఈ పనులు ఎక్కువగానే జరగబోతున్నాయి. కానీ… ఏ అంశానికి సంబంధించిన కనీస సమాచారమూ…. తనకు తెలియడం లేదని, ఇంకా మాట్లాడుకోవాలంటే… పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందంటూ ఎమ్మెల్యే శ్రావణ్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. సన్నిహితులు ఎవరన్నా నిర్మాణ పనుల గురించి అడిగితే… ఏమో సర్ నాకేం తెలీదు, నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తప్ప మరేవీ నాకు అర్ధంకావడం లేదని అంటున్నారట. అంతటితో ఆగలేని వారు … ఆ ప్రాంతం మొత్తం మీ పరిధిలోనిదేకదా అని రెట్టిస్తే… చెబుతున్నాను కదా… ప్రజల సమస్యలే తప్ప నాకు ఇంకేం తెలీదని విసుక్కుంటున్నట్టు సమాచారం.
Read Also: Supreme Court: ‘‘రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత రేప్ కేసులు’’.. సుప్రీం ఆందోళన..
ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఒకవేళ తన ప్రాంత ప్రజలు… ఇక్కడ జరగబోయే పనుల గురించి ప్రశ్నిస్తే… వాళ్ళ తరపున నేను కూడా సంబంధిత మంత్రిని క్వశ్చన్ చేస్తానని అంటున్నట్టు తెలిసింది. తనకు ఎలాంటి గుర్తింపు లేనపుడు, ఏం జరిగితే ఏముంది? ప్రతిదాంట్లో వేలుపెట్టి మూతికి రాసుకోవడం ఎందుకన్నట్టుగా ఉందట ఎమ్మెల్యే శ్రావణ్ వ్యవహారం. మొత్తం మీద ఎంత రాజధాని నిర్మాణం అయితే మాత్రం లోకల్ ఎమ్మెల్యేని, అందునా సొంత పార్టీ శాసనసభ్యుడిని నాకు కనీస గుర్తింపు లేకుండా ఎలాగన్నది శ్రావణ్ కుమార్ బాధగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఆయన బాధను అర్ధం చేసుకుంటారో… లేక ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకుంటారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!