Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..
- సీఎం చంద్రబాబు రాయచోటి టూర్ పై గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
- సీఎం చంద్రబాబు పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది
- కొత్త జిల్లాకు సీఎం వరాలు కురిపిస్తారని ప్రజలు, రైతులు ఎదురుచూశారు- గడికోట
- ప్రజలకు, రైతులకు ఏ ఒక్క వరం ఇవ్వలేదు- గడికోట శ్రీకాంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు. కొత్త జిల్లాకు సీఎం వరాలు కురిపిస్తారని ప్రజలు, రైతులు ఎదురు చూశారు.. ప్రజలకు, రైతులకు ఏ ఒక్క వరం ఇవ్వలేదని అన్నారు. సంపదను సృష్టించండి, అది ఏ రకంగానో నాకు చెప్పండి, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాత మీకు ఇస్తా అనడం చాలా దురదృష్టకరమని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అడిగితే అడిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేస్తున్నారు.. పెన్షన్లు పంపిణీ ఎంచుకొని పబ్లిక్ సిటీ కోసమే ప్రతి నెల 1వ తేదీన ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లో వచ్చి ఇవ్వడం తప్పా.. ఎవరికి ఉపయోగకరంగా అక్కడ కనపడలేదని పేర్కొన్నారు.
Read Also: Crime: ప్రియుడి కోసం పారిపోయిన 13 ఏళ్ల బాలిక.. అమ్మాయిపై పోలీస్ అత్యాచారం..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
బాబు దిగిపోయేటప్పటికి 43 లక్షలు పెన్షన్లు ఉంటే జగన్ ప్రభుత్వంలో 67 లక్షలు ఇచ్చామని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తాము ఏ రోజు కూడా ఇలా పబ్లిక్ సిటీ చేసుకోలేదు.. చంద్రబాబు ఐటీ నేనే చేశానంటూ ప్రచారం చేస్తున్నారు.. ఐటీ 2004లో చంద్రబాబు దిగిపోయేటప్పుడు దేశంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య తేడా చూస్తే సాఫ్ట్‌వేర్ ఆదాయం నక్కకు, నాగ లోకానికి అంత తేడా ఉండేదని విమర్శించారు. వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌లో ఐటీ 10 శాతం అభివృద్ధి చెందింది.. నేనే ఐటీ రంగాన్ని తీసుకొచ్చాను అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. ఇప్పటికీ నేనే హైదరాబాదును నిర్మించానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సభలో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు పక్కన నిలబడి ఉన్నప్పుడు అక్కడున్న యువత కోసం తాను ఎంతో ఆశించానన్నారు. ఈ ప్రాంతం గురించి చెప్తారని అనుకున్నానని తెలిపారు. కానీ వారు మేమే టీడీపీ కోసం ఖర్చు చేశాం, మా గ్రామాలలో పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చున్నామంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
Read Also: Childrens Missing: విశాఖలో కలకలం రేపుతున్న ముగ్గురు చిన్నారుల అదృశ్యం..
టీడీపీకి సంబంధించిన వ్యక్తులను అక్కడ పెట్టుకున్నట్లు కనిపించిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా.. దయవుంచి ఆ యువత గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయవద్దని చెప్పారు. సభలో ముఖ్యమంత్రి అవకాశం కల్పించినప్పుడు మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోయి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు ఐటీ టవర్‌ను మండల హెడ్‌క్వార్టర్‌లో కట్టేస్తాను అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఐటీపై ప్రచారం చేసుకుంటున్నావు.. వర్క్ ఫ్రం హోం కూడా తానే కనిపెట్టానని మభ్యపెట్టే మాటలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజులలో గ్రామాలలో సచివాలయాలను నిర్మించి, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి సంపద సృష్టించండి అని చెప్పడం ఏమిటి..? అని దుయ్యబట్టారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకుండా.. ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!