Rammohan Naidu: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రూ. 12 లక్షల వరకూ మధ్య తరగతి ప్రజలకి ఆదాయపు పన్నులో ఊరట ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనులు స్పీడ్ అందుకున్నాయి.. గత ప్రభుత్వం చేసిన పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని ఆయన వెల్లడించారు. అలాగే, జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చినా సరైన పైప్ లేన్లు వేయలేకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదమని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక కార్యక్రమం ప్రణాళిక చేస్తున్నాం.. రైతులకు అండగా ఉంటున్నాం.. స్టార్టప్ లు ప్రారంభించే యువతకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Ambati Rambabu: ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారు..
ఇక, సివిల్ యావియేషన్ లో ఉడాన్ స్కీంను పొడింగింపుతో పాటు ఇతర దేశాల్లో కూడా వర్తింపు చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. గతంలో కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం భాగస్వామి అయినా విశాఖ రైల్వే జోన్ కు ల్యాండ్ కేటాయించలేదు.. అలాగే, అమరావతి, పోలవరంకు నిధులు తేలేకపోయారు అని ఆరోపించారు. ఉడాన్ స్కీం దేశమంతా వచ్చేలా చూస్తున్నాం.. అన్ని ఎయిర్ పోర్టులలో కార్గో ఫెసిలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. లోకల్ ప్రోడెక్టును కార్గో ద్వారా రవాణా జరిగిలే చర్యలకు ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారని తెలిపారు. చాలా మంది తెలుగువారు ఢిల్లీలో ఉన్నారు.. వారి ఓటు మాకు ఎంతో ముఖ్యం అందుకోసమే చంద్రబాబుని ఎన్డీయే సర్కార్ ఆహ్వానించిందన్నారు. ఢిల్లీని ఓ మోడల్ సిటిగా మార్చాలన్నదే మోడీ సంకల్పం అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.