* నేడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై చర్చ.. ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కానున్న మంత్రులు..
* నేడు రెండో విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈరోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన.. డిసెంబర్ 14న 4,333 గ్రామాల్లో ఎన్నికలు..
* నేడు తెలంగాణలో తొలి విడత పంచాయతీ నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు.. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు అవకాశం.. డిసెంబర్ 11న 4,236 గ్రామాల్లో ఎన్నికలు..
* నేడు బీజేపీ సంస్థగత వర్క్ షాప్.. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జులకు ఆహ్వానం.. హాజరుకానున్న బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్..
* నేడు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. మెదక్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. పటాన్ చెరులో 11, హన్మకొండలో 12.5 డిగ్రీలు.. రామగుండంలో 13.8, నిజామాబాద్ లో 13.9 డిగ్రీలు.. హైదరాబాద్ లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
* నేడు దండకారణ్యం బంద్ కు మావోయిస్టుల పిలుపు.. అల్లూరి జిల్లా ఏజెన్సీలో హైఅలర్ట్.. ఎన్ కౌంటర్లతో ప్రతీకార దాడులు జరగవచ్చని అనుమానం.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఏవోబీలో ముమ్మర కూంబింగ్..
* నేటి నుంచి ప్రాగస్తమిత శుక్ర మూఢమి.. ఫిబ్రవరి 13 మాఘ బహుళ ఏకాదశితో ముగియనున్న మూఢమి.. వివాహాది శుభకార్యాలకు బ్రేక్.. ఫిబ్రవరి 19 నుంచి మళ్లీ ముహూర్తాలు..
* నేడు దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లా్ల్లో భారీ వర్షాలు.. నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
* నేడు ప్రధాని మోడీ128వ మన్ కీ బాత్..
* నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం.. అఖిలపక్ష భేటీకి హాజరుకానున్న రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరపున హాజరుకానున్న గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్, ప్రమోద్ తివారి.. రేపటి నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో, ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
* నేడు తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్లో 57కు పైగా విమాన సర్వీసులు రద్దు..
* నేడు రాంచీ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే.. మధ్యాహ్నం 1: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం..