* నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల్లో సీఎం సభలు.. నేడు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్న మంత్రులు..
* నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన. డీసీసీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న మహేష్ గౌడ్..
* నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. గోపినాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం.. పెన్షన్ల పంపిణీ అనంతరం గొల్లగూడెంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం..
* నేటి నుంచి రెండు రోజులు పాటు ముంబైలో జరిగే ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025’లో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్..
* నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్..
* ఫిల్మ్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కీలకోపన్యాసం చేసి పెట్టబడులను ఆహ్వానించనున్న మంత్రి దుర్గేష్
* నేడు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ముందుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. తన రాజీనామా ఆమోదించడం లేదంటూ.. ఏపీ హైకోర్టులో కేసు వేసిన జయమంగళ వెంకటరమణ.. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి ఛైర్మన్ ను ఆదేశించిన హైకోర్టు.. రాజీనామా ఆమోదంపై ఎమ్మెల్సీతో మాట్లాడనున్న మండలి ఛైర్మన్..
* నేడు అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులు.. మాజీమంత్రి శైలజానాథ్ నేతృత్వంలో అరటి రైతుల ఆందోళన..
* నేటి నుంచి టీడీపీ శిక్షణా శిబిరం.. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 144 మందికి శిక్షణ..
* నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం..
* నేడు విశాఖలో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం.. కైలాసగిరిపై అందుబాటులోకి రానున్న స్కైవాక్ బ్రిడ్జి..
* నేడు ఏపీలో భారీ వర్షాలు.. దిత్వా తుఫాన్ ఎఫెక్టుతో ఇవాళ తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు..
* నేడు తెలంగాణపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేడు ఐ-బొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై విచారణ.. మరో మూడు కేసుల్లో నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్న పోలీసులు.. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు..
* నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకి పార్లమెంట్ బయట ప్రధాని మోడీ ప్రసంగం..
* నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ ప్రక్రియపై చర్చకు పట్టుపట్టనున్న ప్రతిపక్షాలు.. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఉభయ సభలకు చెందిన ప్రతిపక్షాల నేతల సమావేశం.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆఫీసులో విపక్షాలు భేటీ..