మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్.. దీనిపై కేబినెట్లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్‌కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు..
నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు..
వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్‌తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్... 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.. శ్రీసిటీలో ఎల్జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు…
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది. విజయవాడ సహా పలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షం పడుతుంది. గన్నవరం, నందిగామ, తిరువూరు, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో వినాయకుని దేవాలయంలో ఈదురు గాలులకు ధ్వజస్తంభం నేలకొరిగింది.
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత.... నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.