దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి.. మరోవైపు, రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది.. వీటి ప్రభావంతో.. వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని చోట్ల వర్షాలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి.. జంగమేశ్వరపురంలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. వచ్చే ఐదురోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. ఇక, గత 24 గంటల్లో గుంటూరులో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బాపట్ల 9.5, అమలాపురం 83.8, గుడివాడ 82.8, లామ్, సత్తెనపల్లిలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ప్రీ మాన్ సూన్ ప్రారంభమైనట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిర్ధారించింది..
ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. రేపు ప్రధాని మోడీతో భేటీ
ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు మంతరి లోకేష్.. రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు.. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. రేపు ప్రధాని మోడీతో నారా లోకేష్ సమావేశం కానున్నారు..
ఉద్యోగం అన్నాడు.. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు.. నిరుద్యోగులను నిండా ముంచాడు..!
బెజవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామవి లక్షల రూపాయలు దోచేశారు కేటుగాళ్లు. ట్రైవింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారు కేటుగాళ్లు. ఇక, మీకు ఉద్యోగాలకు కూడా వచ్చేశాయంటూ ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా ఇచ్చి.. నమ్మించే ప్రయత్నం చేశారు.. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలను ఇస్తామనే పేరుతో విజయవాడ మొగల్‌రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది.. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయలు వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులు.. మాచవరంవరం పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చినా న్యాయం జరగలేదని విజయవాడ పోలీస్ కమీషనర్‌ను కలిసేందుకు వెళ్లారు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని అంటున్నారు బాధిత నిరుద్యోగులు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.. సంస్థ ప్రతినిధులు నాగరాజు అండ్ హెచ్ఆర్ శిరీషను అరెస్ట్ చేయకుండా మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.. అయితే, మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు.. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చు అని హేళంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు.. దీంతో, చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులు.. సీపీ రాజశేఖర్ బాబు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
సీతక్క సంచలన వ్యాఖ్యలు.. పార్టీకి చెల్లి రాజీనామా చేస్తుందేమోనని భయం పట్టుకుంది..
ఎన్టీవీతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించింది. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడు అంటూ మండిపడింది. చెల్లి రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుంది అన్నారు. కమిషన్లకి కక్కుర్తి పడ్డది కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీది కమిషన్ల ప్రభుత్వం, కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం మాది అని ఆమె అన్నారు. ఇక, సుందరిమణుల్లో ఒకరికో ఒక్క అమ్మాయి అలా చేస్తే దాన్ని ప్రభుత్వానికి అంట గట్టడం అవివేకం, దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు..గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో భూములు మారిపోయాయని మంత్రి సీతక్క పేర్కొనింది. అయితే, ధరణిలో మోఖ మీద ఉన్న రైతులకు కాకుండా వేరే వాళ్ళకి భూములు పట్టాలు చేశారని సీతక్క అన్నారు. భూమి న్యాయంగా ఎవ్వరికి దక్కాలో వారికే దక్కేందుకు తీసుకొచ్చిందే భూ భారతి లక్ష్యం.. భూ స్వాములకు తిరిగి భూములు తీసుకోవడం కోసం ధరణి పని చేసింది.. జూన్ 2వ తేదీ నుంచి రైతుల కనీళ్లు తుడిచేది భూ భారతి అమలు చేస్తున్నాం.. ఇక, రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు.. ఐటిడిఎల పరిధిలో ఉన్న వాళ్ళకు స్పెషల్ గా ఇండ్లు ఇస్తాం.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ఇండ్లు.. ప్రజా ప్రతినిధులు అర్హత లేని వారు ఉంటే చెప్పండి తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ లిస్టులో రాకపోతే తరువాత వచ్చే లిస్టులో ఉంటదని మంత్రి సీతక్క వెల్లడించింది.
వివాదాస్పద వ్యాఖ్యలపై కొండా సురేఖ క్లారిటీ..
ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే? కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు చేస్తున్నాం.. మంత్రులు మాత్రమే కమిషన్ తీసుకుంటారు అని మంత్రమే చెప్పాను.. కాంగ్రెస్ మంత్రులు అని నేను అనలేదు.. బీఅర్ ఎస్ పెయిడ్ వాళ్ళు కావాలని దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఅర్ ఎస్ నేతలు కమిషన్ తీసుకొని పనులు చేశారు.. గతంలో బీఅర్ ఎస్ పార్టీలో మంత్రులుగా పని చేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి.. మంత్రి కాకముందు మీ అస్తులు ఎంత?ఇప్పుడు మీ అస్తులు ఎంత పెరిగిందో ఎంక్వయిరీ చేయించండి.. నిజాలు బయటకు వస్తాయన్నారు.
అమెరికాకు ఎమ్మెల్సీ కవిత.. హరీశ్ రావు నివాసానికి కేటీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. తాజా రాజకీయలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరికాసేపట్లో అమెరికాకు ప్రయాణమై వెళ్ళనున్నారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఆమె అమెరికాకు వెళ్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో కవిత భర్త అనిల్ ఉన్నారు. ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నా కవిత. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.
మసూద్ అజార్‌కి రూ.14 కోట్లు ఇచ్చింది.. పాక్ టెర్రర్ ప్లాన్‌పై రక్షణమంత్రి వార్నింగ్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్‌ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ‘‘మురిడ్కే, బహవల్పూర్‌లలో ఉన్న లష్కరే తోయిబా (LeT), జైషే-ఏ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఐఎంఎఫ్ నుండి వచ్చే ఒక బిలియన్ డాలర్లలో గణనీయమైన భాగాన్ని ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. దీనిని ఐఎంఎఫ్ పరోక్ష నిధులుగా పరిగణించదా?’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు.
జొమాటో, స్విగ్గీ యూజర్లకు షాక్.. వర్షాకాలంలో అదనపు బాదుడు..
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్స్ అయిన స్విగ్గీ, జొమాటోలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వర్షాకాలం కోసం కొత్త నియమాలను తీసుకువచ్చాయి. ఇకపై వర్షం సమయంలో, బ్యాడ్ వెదర్ ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ చేయాలంటే సబ్‌స్క్రిప్షన్ వినియోగదారుడు కూడా అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. సాధారణ యూజర్లతో సహా, సబ్‌స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులను కూడా ఇకపై ఒకే విధంగా ట్రీట్ చేయనున్నాయి. స్విగ్గీ తర్వాత, దాని ప్రత్యర్థి అయిన జొమాటో కూడా వర్షాకాలం కోసం దాని గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాల్లో కొత్త మార్పుల్ని తీసుకువచ్చింది. శుక్రవారం నుంచి, వర్షాకాలంలో గోల్డ్ సభ్యులకు సర్జ్ ఫీజుల నుంచి మినహాయింపును తీసేసింది. అంటే, వర్షం పడుతున్నప్పుడు ఫుడ్ డెలివరీకి వినియోగదారులు అదనపు రసుము చెల్లించాల్సి ఉంటుంది. యాప్‌లో నోటిఫికేషన్ ద్వారా కంపెనీ ఈ మార్పు గురించి వినియోగదారులకు తెలియజేసింది. “మే 16 నుండి, వర్షాల సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు మీ గోల్డ్ ప్రయోజనాలలో భాగం కాదు” అని మెసేజ్ ద్వారా వెల్లడించింది.
ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్త.. ఈ టిప్స్ మీకోసమే..
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మొదటగా ఎలక్ట్రిక్ వాహనాన్ని వేడికి గురికాకుండా చూడాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కువసేపు ఎండలో ఉంచొద్దు. ఎండలో వాహనాన్ని పార్క్ చేయొద్దు. షెడ్స్ కింద, నీడ ప్రాంతంలో మీ వాహనాన్ని పార్క్ చేయాలి. బ్యాటరీలకు ఏదైనా నష్టం జరగకుండా నిరోధించడానికి తప్పనిసరిగా బ్యాటరీకి అనుకూలంగా ఉండే అధీకృత లేదా ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలి. బ్యాటరీని తరచుగా ఛార్జ్ చేయొద్దు. బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ముందు బ్యాటరీని కూల్ అయ్యేంత వరకు ఉంచాలి. మీ వాహనం బ్యాటరీలో ఏదైనా లీక్ లేదా డ్యామేజీని గమనించినట్లయితే వెంటనే పరికరాన్ని వేరు చేసి డీలర్‌కు సమాచారం అందించారు.
‘కన్నప్ప’ కామిక్ సిరీస్ నుంచి మరో వీడియో రిలీజ్..
మంచు విష్ణు నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి తరచూ అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న మూవీ టీమ్.. కన్నప్ప కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి కామిక్ సిరీస్ పేరుతో వీడియోలను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫైనల్ వీడియోను వదిలింది. ఇందులో తిన్నడు మార్పును ప్రధానంగా హైలెట్ చేస్తూ చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తిన్నడు ముందు ఎందుకు శివుడిని వ్యతిరేకించాడు అనేది చూపించారు. ఆ తర్వాత తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు.. అందుకు ప్రధాన కారణాలు ఏంటి అనేది కాస్త హింట్ ఇచ్చారు. ఈ ఫైనల్ వీడియోను భక్తి, దైవత్వంతో నింపేశారు. ఈ కామిక్ వీడియోలను కార్టూన్ టైప్ లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని పాత్రలను కూడా ఈ కార్టూన్ స్టైల్ లో చూపించేస్తున్నారు. కానీ ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ పాత్రలను బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా : జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రతి బర్త్ డేకు ఏదో ఒక బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేకు వార్-2 నుంచి సర్ ప్రైజ్ ఉంటుందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. ఈ రోజు హృతిక్ రోషన్ కూడా దీన్ని రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ మే 20న ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్.. నన్ను నమ్ము నువ్వు నీకు తెలియని మంచి గిఫ్ట్ రెడీ అవుతోంది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘థాంక్యూ హృతిక్ రోషన్ సర్. నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చేయలేకపోతున్నా కబీర్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హృతిక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ మూవీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఎన్టీఆర్ బర్త్ డేకు ఎలాంటి గిఫ్ట్ వస్తుందో చూడాలి.