Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది.
YS Jagan: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (ఏప్రిల్ 29) సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.
ఆరిణి శ్రీనివాసులు... తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే... ఫైనల్గా ఆయనకే ఖరారు చేశారు పవన్కళ్యాణ్.
అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చానన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తరువాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమెను కొనసాగించకపోవచ్చన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో.
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుపతిలో జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఐదుగురు మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది.. కంటైనర్ వాహనం కిందకు దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పూర్ణ తేజేశ్వరరావు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్కి తరలించారు.
ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు..
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.. ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరు అయ్యారు.. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు..