MLC Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా.. పాకిస్తాన్ అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. సంపద సృష్టిస్తామని అన్నారు కదా.. ఇప్పుడు ఏమి అయ్యింది? అని ప్రశ్నించారు.. ఇక, వరి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అని ఫైర్ అయ్యారు.. ఏడాదిగా ప్రభుత్వం హనిమూన్ చేసింది.. ఇచ్చిన ఒక మాట కూడ నిలబెట్టుకోలేదు.. సూపర్ సిక్స్ ఏం అయ్యింది..? అని నిలదీశారు.. అయితే, ప్రతి పక్షంగా ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తెస్తాం అన్నారు.. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి మీరు ఎవరు? 40 శాతం ప్రజలు మాకు ఓటు వేశారన్నారు.. మరోవైపు.. ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తుంది.. రైతుల సమస్యల పట్ల వైసీపీ క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తుంది.. జగన్ కూడా రైతులు దగ్గరకు వస్తారు.. ఆక్వా ,పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.
జూన్‌లోపు మండల స్థాయి, జులై లోపు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. జూన్ 1 నుంచి 50 రోజులు లోపు ఐదు జిల్లా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు బొత్స.. ఇక, సీజ్ ద షిప్ అన్నారు.. అదంతా ఆమ్యామ్యా అయిపోయిందా? అని సెటైర్లు వేశారు.. ఒక్క గింజ కూడా బయటకు వెళ్లదు అన్నారు.. మరి ఏమైంది అని ప్రశ్నించారు. ఇక, ఎకరం 99 పైసలు ఇవ్వడం దేశంలో ఎక్కడైనా ఉందా..?పోలీసులతో ప్రభుత్వాలు నడుపుతానంటే కలకలం జరగదు.. మీరు ఏ విచారణ అయిన చేసుకోండి.. నీతి నిజాయితీగా చేసుకోండి అని సూచించారు.. ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లై మంత్రి చెప్తున్న మాటలు బూటకం అన్నారు.. జిల్లా నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడం పవన్ కల్యాణ్ అదృష్టంగా పేర్కొన్న ఆయన.. పవన్ కల్యాణ్ రైతులు దగ్గరకి రాకపోవడం రైతులు దురదృష్టకరం అన్నారు.. మీ తాబేదారులు కి బకాయిలు ఇచ్చుకో మాకు అభ్యంతరం లేదు.. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా.. చిత్త శుద్ధి లేదా? అని నిలదీశారు.. సో కాల్డ్ కేంద్ర మంత్రి ఉద్దానం కి ఏమి చేశాడు? అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు అన్నారు.. ఏం అయ్యింది.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ..