గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి..
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది..
రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. రానున్న మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు..
ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో ఏపీ నుంచి ఎవరికీ రాజ్యసభ స్థానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది... అయితే, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.. దీంతో బీజేపీ నుంచి కొన్ని…
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచామని ఓ ప్రకటను పేర్కొన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి…
ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చేనెల 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు... ప్రధాని రాక కోసం పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం .. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెనుక స్ధలంలో అతిపెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..
కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్కు దిగాడు.
ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం అయింది. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది.