రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు.. ఐతనగర్ లో చిరంజీవి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన శైలజ.. కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు..
నైరుతి రుతుపవనాలు "షార్ట్ బ్రేక్" తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి.
మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో.. తుని రైలు ప్రమాదం కేసు అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చిందట.. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే.. ముందే జాగ్రత్త పడాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, జరిగిన పొరపాటుకు సీఎంకు క్షమాపణలు చెప్పారు హోంశాఖ కార్యదర్శి..
సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..
తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చల సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు.. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేయగా.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు..
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.
ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఏడాది పాలన పై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. సంక్షేమ పథకాల విషయంలో జనానికి స్పష్టంగా చెప్పాలని సూచించారు.. తల్లికి వందనం అమలుపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది..