రెండేళ్లపాలన కూడా పూర్తికాకముందే వరుసగా మూడో ఏడాది మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా సామాన్యుడికి ఉన్న కష్టం పెద్దది. నేరుగా వారి అక్కౌంట్లోకి సుమారు రూ.120 కోట్లు పంపుతున్నాం. ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10వేల…
కరోనా మహమ్మారి ఏకంగా కుటుంబాలను.. కుటుంబాలనే కబలించేస్తోంది.. కుటుంబంలోని పెద్దలతో పాటు.. ఈ కుటుంబానికి సర్వం తానై చేసుకునే యువకులను కూడా కోవిడ్ బలితీసుకుంది. తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు. తాము ఉన్నామంటూ చేరదీసేవారు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకి ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. కోవిడ్ తో అనాథలైన చిన్నారుల పేరు పై రూ.10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిటివ్ చేయాలని నిర్ణయం…
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, సుప్రీంకోర్టు.. రఘురామను ఆస్పత్రికి తరలింపు అంశంపై ఉత్తర్వులు ఈరోజే ఇచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు ఏఏజీ..…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది… రఘురామకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది.. ఇక, ఈ సమయంలో రఘురామ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని సూచించింది.. తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియల్ అధికారిని నామినేట్ చేస్తుందన్న సుప్రీంకోర్టు.. ఆ జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ.. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.…
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కర్ఫ్యూ, కరోనా కేసుల విషయంపై ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు కట్టడి కావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని, ప్రస్తుతం కర్ఫ్యూ అమలులోకి వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యిందని, కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడం మేలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. మే…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…