కరోనా మహమ్మారి ఏకంగా కుటుంబాలను.. కుటుంబాలనే కబలించేస్తోంది.. కుటుంబంలోని పెద్దలతో పాటు.. ఈ కుటుంబానికి సర్వం తానై చేసుకునే యువకులను కూడా కోవిడ్ బలితీసుకుంది. తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు. తాము ఉన్నామంటూ చేరదీసేవారు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకి ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. కోవిడ్ తో అనాథలైన చిన్నారుల పేరు పై రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిటివ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని ఆ చిన్నారులు నెలనెల తీసుకునే వీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.. ఆ చిన్నారులకు 20 ఏళ్లు నిండిన తర్వాత ఎఫ్‌డీ మొత్తాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపటిలోగా విడుదల చేయనుంది ప్రభుత్వం.