నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీఐడీ కోర్టు నిరాకరించింది. అయితే తనను పోలీసులు కొట్టారని, ప్రైవేట్ ఆసులపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతించాలని, బెయిల్ మంజూరు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో కేసు ధాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని, వైద్యపరీక్షలను వీడియో తీయాలని ఆదేశించింది.…
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జరిపామన్నారు.. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేసిన ఆయన.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.. ఈ సమయంలో.. 40 ఏళ్ల ఇండస్ట్రీ పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇక, మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం…
తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుందని కామెంట్ చేసిన ఆయన.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బడ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్ లో ఎంతో కోత పెడుతోందన్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 114 కు పెరిగింది.. ఇదే సమయంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య…
ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. వెనక బడిన కులాలకు బడ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఇక ఏ…