నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ఇంకా ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..