నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…
నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు.. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను జీజీహెచ్ నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తరలించారు.. ఇక, ఆయనకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 24,171 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 101 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల…
కరోనా సెకండ్ వేవ్ ఏపీలో కల్లోలమే సృష్టిస్తోంది… ఇక, చిత్తూరు జిల్లాలో వరుసగా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి… దీంతో.. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిని కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ ఆస్పత్రిలో వంద ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు మంత్రి… రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ కు సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. గుజరాత్ నుండి…
మన దేశంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండగా… ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూ ఉంది. అయితే తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఆ జిల్లాలోని నిడదవోలు పాత పశువుల హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు అనుమానం రేకెత్తుతుంది. అయితే 15 రోజుల క్రితం కరోనా నుండి కోలుకున్న అంజిబాబుకు గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుంది. దాంతో ఆసుపత్రికి…
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద ఉన్న అతి తీవ్ర తుఫాను – తౌక్టే- గడచిన 06 గంటల్లో, గంటకు సుమారు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిం చి, ఈ రోజు – 16 మే, 2021 ఈ రోజు 08.30 గంటల కు- తూర్పు మధ్య అరేబియా సముద్రం దగ్గర Lat 15.3 deg N, / Long 72.7 deg E వద్ద, పనజిం – గోవా కి పశ్చిమ నైరుతి దిశగా 120…
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు……
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్‌కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటను కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం,…