కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలిపే విధంగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు చేరాయి. అయితే రాష్ట్రానికి కొత్తగా చేరిన 76 వేల కొవిషీల్డ్, 50 వేల కొవాగ్జిన్ టీకాలతో వ్యాక్సిన్ కొరతకు కొంత ఉపశమనం లభించింది. ఈ టీకాలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు తరలించనునారు అధికారులు. మరికొన్ని టీకా డోసులు రాష్ట్రానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో కరోనా…
సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. అనంతరం రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనీ.. పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని పేర్కొన్నారు.. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్‌లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి……
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి… గత బులెటిన్ ప్రకారం 18 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. మరోసారి కొత్త కేసులు 20 వేలు దాటింది.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్…
బడ్జెట్ సమావేశాలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈనెల 20వ తేదీన ఒకేరోజు సభ నిర్వహించనున్నారు. అయితే, ఒకేరోజు సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, మెజార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించడమే మంచిదని పార్టీ చీఫ్‌కు తెలియజేశారు.. కోవిడ్‌తో సహా అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారని.. కేసులు, ఇతర…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం.. అత్యంత తీవ్ర తుఫాన్ ‘తౌక్టే’ గడచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో ‘అతి తీవ్ర తుఫానుగాస మారిందని.. అమ్రేలికి తూర్పు దిశగా 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. రాగల 3గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫాన్‌గా.. ఈరోజు…
కరోనా సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండగా… తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో బయటపడుతూనే ఉన్నాయి బ్లాక్ ఫంగస్ కేసులు… ఇక, ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది… జిల్లాలో పది రోజుల వ్యవధిలో 12 మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడగా… కేవలం మార్కాపురంలోనే ఏడుగురికి బ్లాక్ ఫంగస్ గుర్తించారు.. ఇక, బ్లాక్ ఫంగస్ భారిన పడి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు…
ఏపీ ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ…గత ఏడాది సుమారు 1.82 లక్షల…