కరోనా సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కలవరపెడుతోంది.. ఇక, కొన్ని ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందక, ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు ప్రాణాలు విడవడం ఆందోళనకు గురి చేస్తోంది.. అయితే.. ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్సలో లోపాలు, ఆక్సిజన్ అందక జరిగిన మరణాలపై పరిహారం ఇవ్వాలని హైకోర్టు సీజేకి న్యాయవాదులు లేఖ రాశారు.. న్యాయవాదులు రాసిన మూడు లేఖలు హైకోర్టు సీజేకు చేరగా.. ఆ లేఖలను సుమోటోగా విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు.. వాటిపై…
కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారినపడగా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.. ఇక, గన్నవరం విమానాశ్రయం లో…
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ రఘురామకృష్ణరాజు ను అరెస్టును ఖండించారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను…
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ముంపు దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగాల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద…
నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు విచారించనున్నారు. నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారిని లక్ష్యంగా…
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడనుంది. కాగా ఈ నెల 18న ‘తౌక్టే’ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లపై దీని ప్రభావం వుండనుందని తెలిపింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘరామకృష్ణరాజును తరలించారు. ఆయన వస్తున్న సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,05,494 శాంపిల్స్ పరీక్షించగా 22,018 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 96 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 12,749 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…