కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,17,156 కు చేరింది. ఇందులో 15,62,229 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,43,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 98…
కరోనా వైరస్ ఎందరో ప్రాణాలు తీసింది.. ఇంకా తీస్తూనే ఉంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి మరణించినవారి మృతదేహాలు తారుమారైన ఘటనలు చాలానే ఉన్నాయి.. కానీ, విజయవాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది.. కరోనాబారినపడిన గిరిజమ్మ అనే మహిళలను బెజవాడ జీజీహెచ్లో చేర్చాడు భర్త.. ఆ తర్వాత ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి సమాచారం ఇచ్చారు.. ఓ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ తంతు జరిగి 15…
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…
కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన.. వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు.. మరోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని…
బ్రహ్మంగారి మఠానికి సంబందించి పీఠాధిపతి ఎంపిక కోసం వారసుల మద్య ఆదిపత్యపోరు జరుగుతున్నది. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదానికి చెక్ పెట్టేందుకు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పలువురు పీఠాదిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం మఠం ఆలయ పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అలయంలోకి ఎవరిని అనుమతించడంలేదు. వారసుల మద్య సయోధ్యను కుదిర్చి పరిస్థతిని చక్కదిద్దేందుకు పీఠాధిపతులు ప్రయత్నం…
చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జులిపించిన రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి ఆసుపత్రి, పీలేరు లోని ప్రసాద్ ఆసుపత్రి, మదనపల్లి లోని చంద్ర మోహన్ నర్సింగ్ హోమ్ లపై లక్షలాది రూపాయలు ఫైన్లు విధించింది జిల్లాయంత్రాంగం. 3 రోజుల్లో విధించిన రుసుం కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆసుపత్రుల యజమాన్యం పై ఐపీసీ 188, 406,…
కరోనాతో మృతిచెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ. 10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు. నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది.…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వచ్చాయి.. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికొత్స పొందుతున్న తమ్మినేని.. అయితే, తమ్మినేని ఆరోగ్యపరిస్థితిపై ఆయన కుమారు చిరంజీవి నాగ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.. నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు.. డీ హైడ్రేషన్ కు గురైనందున జ్వరం వచ్చిందని.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున ముందస్తు జాగ్రత్త కోసమే ఆసుపత్రిలో చేర్చినట్టు విరించారు.. ప్రస్తుతం నాన్నగారి రిపోర్టులన్నీ నార్మల్…