వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్…
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. కరోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జమ చేయనున్నట్టు వెల్లడించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,25,682 కు చేరింది. ఇందులో 15,75,557 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,38,912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.…
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జులై నెలలో పరీక్షల నిర్వాహణపై సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం తరపు వాదనలు విన్న తరువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కరోనా విజృంభిస్తుండటంతో వాయిదా వేశారు.…
ఇల్లులేని పేదలకోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో సుమారు 15 లక్షలకు పైగా గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులను కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న కాలనీల నిర్మాణం పనులను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన గృహనిర్మాణ పనులను పూర్తిచేస్తామని, రాష్ట్రజనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని ఇస్తున్నామని సీఎం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పేదలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగనన్న కాలనీల పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈరోజు నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలు కాబోతున్నది. సీఎం వైఎస్ జగన్ ఈరోజు వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 15,60,227 ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 28,084 కోట్ల రూపాయలను కేటాయించింది. మూడు…
ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా వాటికి అనుమతిని ఇచ్చింది. కాగా, నేడు ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి…
ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మళ్లీ మందు పంపిణీ ఏర్పాట్లలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. అయితే, మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న సమయంలో.. సోమవారం నుండి అందుబాటులోకి…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానా సర్వీసులు నిలిచిపోయాయి… ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ విమానాలను నిలిపివేశారు అధికారులు.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త చేతుల్లోకి రావడంతో.. తిరిగి విదేశీ సర్వీసులను ప్రారంభించారు.. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో రాష్ట్రానికి చేరుకుంది ప్రత్యేక విమానం.. అయితే, ఇవి గతంలో మాదిరి రెగ్యులర్ సర్వీసులు కావు.. వందే భారత్ మిషన్లో భాగంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.. దీంతో..…