ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ పరీక్షలను రద్దు చేశామని అన్నారు. విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులను చేశామని… సుప్రీం కోర్టు జులై 31 లోపు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించిందని తెలిపారు. కానీ గడువుకు వారం ముందే ఫలితాలు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మార్కుల విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
Read Also : తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!
టెన్త్‌లో టాప్ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇచ్చామని… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్ మార్కులకు 70శాతం మార్కులు ఇచ్చామని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తైనందున వాటి ఫలితాల ఆధారంగా మార్కులు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. పిల్లలు అందరికీ కనీస ఉత్తీర్ణత మార్కులు ఉండేలా అని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలు నిర్వహించే పరిస్థితులు వచ్చినప్పుడు అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ పరీక్షల్లో మొత్తం విద్యార్థులు 5,19, 797 ఉత్తీర్ణులు అయ్యారని పేర్కొన్నారు.
పరీక్షా ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్సైట్ లు :
examresults.ap.ac.in
bie.ap.gov.in
results.bie.ap.gov.in
results.apcfss.in