ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కట్టడికి ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా మహమ్మారి కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. దీంతో జూన్ 1 వ తేదీ నుంచి ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్దమయ్యారు. రూరల్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం…
నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయాంధోళనలకు గురయ్యి బయటకు పరుగులు తీశారు. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ ఘటన జరిగింది. స్వల్పంగా మాత్రమే భూమి కంపించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు భూమి కంపించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ జిల్లాకు వానలు,…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 104 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్‌లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది సర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయిన సర్కార్.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న…