Amaravati Farmers: జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో అభివృద్ధి పనుల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
దేవాలయ భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు ఆరోపించారు. దేవాలయ భూముల్లో ప్లాట్లు ఇస్తామని చెబుతున్నారని, ఆ భూములను రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణ విషయంలో తమకు అండగా నిలవాలని జగన్‌ను కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయిందని రైతులు పేర్కొన్నారు. ఈ ప్రాంత గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరం లేదని, కరకట్ట రహదారిని విస్తరించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్), సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) నిర్వహించకుండా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని జగన్‌ను రైతులు కోరారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
తాజావార్తలు
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!