ఈరోజు నుంచి ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆనందయ్య మందును నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు మందును సరఫరా చేయనునున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ జరగడంలేదని, అక్కడికి ఎవరూ రావొద్దని ఇప్పటికే అధికారులతో పాటు మందు తయారు చేస్తున్న ఆనందయ్య కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి బయట ప్రాంతాల వారిని అనుమతించడంలేదు. గతనెల 21 వ…
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ ఆడియో టేపు లీక్ కావడం పెద్ద కలకలమే సృష్టించింది.. ఆస్పత్రిలో మహిళా డాక్టర్లను, జూనియర్ డాక్టర్లను, సిబ్బందిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తారనే ఆరోపణలు వచ్చాయి.. ఓ విద్యార్థిని ఆయనకు ఫోస్ చేసి.. నన్ను నీ రూమ్‌కి రమ్మంటావా? లేకపోతే కాళ్లు చేతులు కట్టి, ప్లాస్టర్ వేసి తీసుకుపోతానంటావా? అడిగితే ఇదంతా కామన్ అంటావా? అంటూ చెడమా వాయింది.. నా స్థానంలో నీ కూతురు ఉంటే పరిస్థితి ఏంటి? అంటూ నిలదీసింది.. ఇక,…
క్రికెట్ ఆడుతుండగా పిడుగు పాటుతో ఓ యువకుడు కన్నుమూశాడు.. మరో ఎనిమిది మంది యువకులు గాయాలపాలయ్యారు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని ఈశ్వరమ్మ కాలనీలో శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆటకు ప్రారంభించారు స్థానిక యువకులు.. రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు.. అయితే, అదే సమయంలో.. భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది.. క్రికెట్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్న ఆ యువకులు ఊహించని ఘటన జరిగింది..…
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. వీరిలో కలెక్టర్లు.. పెద్ద సంఖ్యలో జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.. ఇక, ఇవాళ ఏపీ సర్కార్ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు పరిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ బదిలీ.. ఆయన స్థానంలో ఎల్.ఎస్.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ.. ఆయన స్థానంలో నాగలక్ష్మి…
ఈ నెల 13వ తేదీన జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… జమ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జరగనుంది… రెండో దశలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది…
అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ…
గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ,…
నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్…
ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడికి ఓ పాడుబుద్ది ఉంది.. ఆయనకు కామ వాంఛలు ఎక్కువట.. అదును దొరికితే చాలు.. నా రూమ్‌కి వస్తావా? నా రూమ్‌లో ఏసీ ఉంది..? నీ రెండు చేతులూ కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి ఎత్తుకుపోతా..? అంటూ ఫోన్లో వేధించడం చేస్తున్నారట.. అయితే, ఓ హౌజ్ సర్జన్ అయ్యగారి నీచ శృంగార పురాణాన్ని బయటపెట్టారు.. ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయన..…