Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- బీజేపీకి రాజీనామా చేసేందుకే అన్నామలై నిర్ణయం..
- పార్టీలో ఉండేలా ఒప్పించేందుకు బీజేపీ ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి.
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లను కలిశారు. తాను సొంత పార్టీ పెట్టి, సొంత మార్గంలో పయనించాలని అన్నామలై భావిస్తున్నారు. బీజేపీ నుంచి సౌహార్దపూర్వక రీతిలో విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను కూడా బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించారు. అయితే, అన్నామలై లెవనెత్తిన అంశాలను పరిశీలించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని పార్టీ ఆయనను కోరింది. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
Also Read
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్నామలై ముందుగా ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన ‘వి ది లీడర్స్’ అనే నాయకత్వ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. 234 సభ్యులు ఉన్న తమిళనాడు ఎన్నికల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత అన్నామలై రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!