హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
ఏపీలో కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ఫ్యూ కారణంగా ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,87,883 కు చేరింది. ఇందులో 16,77 ,063 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 99057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక…
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.. సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు…
బాలయ్య పుట్టిన రోజు వేడుకలునేడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని ఆయన నివాసం వద్ద తెదేపా నాయకులు, అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. వాహనం దగ్ధంఅనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఓబులేసు కోన మలుపు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. పాస్ పోర్టు సేవలు పునఃప్రారంభంఅనంతపురం జిల్లాలో ఈనెల 11 నుంచి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు…
శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ,…
ఈనెల 7 వ తేదీ నుంచి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతున్నది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజక వర్గంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈరోజు మందును పంపిణీ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్ లో మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్‌తో పాటుగా, మంత్రి బాలినేని ఇంటి వద్ద కూడా…
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్…
మైనింగ్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఈ విధానం వల్ల అదనంగా 35 నుంచి 40 శాతం సీనరేజీ ప్రభుత్వానికి జమ అవుతుందని అంచనా ఉందన్నారు.. వాల్యూమెట్రిక్ కు బదులు వెయిట్ బేసిస్ లో సీనరేజీ వసూళ్ళకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.. అక్రమ మైనింగ్, రవాణాను నియంత్రించగలిగితే 15 నుంచి 20 శాతం రెవెన్యూ పెరుగుతుందని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-జూనియర్ డాక్టర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. జూడాలతో మంత్రి ఆళ్లనాని, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు.. వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు జూడాల ప్రతినిధులు.. కాగా, తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు..…