వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ.. మరోవైపు.. తనపై నమోదైన కేసుల విషయంలో ఇతరుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు రఘురామ.. ఇక, ఇవాళ రఘురామపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ రఘురామకి పనిలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. మా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని వదిలేసింది… ఎక్కడ విఫలమైందో.. చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. కరోనా మహమ్మారి సమయంలోనూ మెడికల్ కళాశాలలను మంజూరు చేశామని గుర్తుచేశారు.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. పార్టీని అస్థిర పరిచేందుకు రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.