నేటి నుండి ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయనుంది జగన్ సర్కార్. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకే సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి స్లాట్ల బుకింగ్ మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్నది. అటు దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. read also : ఇండియా కరోనా…
తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.…
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి…
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఇక సీఎం జగన్ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.10 గంటల నుంచి 12…
సీపీఐ రామకృష్ణ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాలక వర్గం దోపిడికి కారణం కమ్యూనిస్టులు కలిసి పని చేయకపోవడమే అని అన్నారు. కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే పాలక వర్గం దోపిడిని అరికట్టవచ్చని, ఈ విషయంలో సీపీఐకి స్పష్టమైన వైఖరి ఉందని, కలిసి పనిచేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక, ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వెళ్తె విద్యార్ధులను అరెస్ట్…
గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు జోష్ బాబు అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులకు మీ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ నిందితుడు బెదిరించాడు. బాలిక తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.3.30 లక్షలు బెదిరించి తీసుకున్నాడు. నిందితుడు జోష్ బాబు ఇంజనీరింగ్ చదివి ఓ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. జోష్ వద్ద నుంచి గోల్డ్ చైన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు సౌత్ డీఎస్పీ ప్రశాంతి…
పెట్రోల్ ధరలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని చురకలు అంటించారు. read also…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్…