గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు జోష్ బాబు అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులకు మీ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ నిందితుడు బెదిరించాడు. బాలిక తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.3.30 లక్షలు బెదిరించి తీసుకున్నాడు. నిందితుడు జోష్ బాబు ఇంజనీరింగ్ చదివి ఓ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. జోష్ వద్ద నుంచి గోల్డ్ చైన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు సౌత్ డీఎస్పీ ప్రశాంతి మాట్లాడుతూ.. మహిళలు అనవసరంగా మోసగాళ్ళ మాటల్లో పడవద్దని.. మహిళల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ఇబ్బందులకు గురైతే పోలీసులను వెంటనే సంప్రదించండి అంటూ తెలిపారు.