అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తోంది.. అయితే, ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అంతేకాదు.. టీడీపీ నేతలకు సవాల్ కూడా విసిరారు.. అమర రాజా విషయంలో టీడీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినా రోజా.. అది రాజకీయ సమస్య కాదు కాలుష్యం సమస్య అన్నారు.. ఎల్జీ పాలిమర్ విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు ? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. చంద్రబాబు నాయుడు అండ్ పచ్చ బ్యాచ్ అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.. నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందని.. కాలుష్యంతో అనారోగ్యం బారినపడిన వారికి వైద్య చేయించవచ్చుగా అని నిలదీశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అండ్ కోకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రోజా.. బాబు అండ్ టీం వెళ్లి నిజానిర్ణారణ కమిటీ వేసి తప్పులేదని నిరూపించండి చూద్దాం అంటూ సవాల్ చేశారు.. కనీసం ఆ కంపెనీ కూడా తప్పులేదని చెప్పలేదని.. గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైంది.. అమర్ రాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అమర రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలని సూచించిన ఆమె.. తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు రోజా.. ఇక, భారతీ సిమెంట్స్ పై చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా సార్లు దాడులు చేయించారు.. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కనపడలేదన్నారు. కక్ష్య సాధించాలంటే హెరిటేజ్ ఫ్యాక్టరీ మూసివేయించవచ్చుగా.. కానీ, అక్కడ పద్ధతిగా చేస్తున్నారు ఇబ్బందులు లేవన్నారు రోజా.