ఏపీ కాంగ్రెస్‌లో కీలక మార్పులు..! కొత్త పీసీసీ చీఫ్ ఎవరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై రాహుల్ చర్చలు జరపనున్నారు.
రాష్ట్ర నేతలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు రాహుల్ గాంధీ.. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్న ఆయన.. రాష్ట్ర నేతల అభిమతం తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. ఈ నెల 11న హస్తినకు రావాలంటూ.. ఇప్పటికే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావును ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది.. కష్టసమయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి లాంటివారు పార్టీ పగ్గాలు తీసుకుని లాక్కొచ్చారు.. ఆ తర్వాత శైలజానాథ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించడంతో.. పార్టీలో కొత్త ఊపు వచ్చింది.. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీలో జోష్ పెంచాలంటే ఏం చేయాలని అనేదానిపై దృష్టిసారించారు రాహుల్ గాంధీ.
Also Read
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!