టీటీడీ బోర్డు చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
టీటీడీలో గతంలో చేయకుండా మిగిలిన కార్యక్రమాలకు తోడుగా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి… ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్లో టీటీడీ ఎలాంటి వివక్ష చూపలేదన్న ఆయన.. బోర్డు సభ్యుల నియామకంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఒత్తిళ్లకు లొంగని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి… సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించామని గుర్తు చేసుకున్నారు.. అయితే, కోవిడ్ నేపథ్యంలో కొన్ని పనులు చేయలేకపోయాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.