ముదురుతున్న జలవివాదం.. పోటా పోటీ లేఖలు.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్ 1న జరిగే KRMB మీటింగ్‌కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం కెఆర్ఎంబీ, ట్రైబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని చెప్పుకొచ్చారు. సరైన పూర్తి సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా మాట్లాడాలని అధికారులకు సూచించారు కేసీఆర్.
ఇటు కృష్ణా జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోకూడదని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా కేఆర్‌ఎంబీకి వరుస లేఖలు రాస్తోంది. వచ్చేనెల 1న జరిగే భేటీలో గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. విభజన జరిగిన తర్వాత ఏడేళ్ల వరకు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన గెజిట్ విడుదల చేయలేదు. గతంలో గెజిట్ విడుదల చేయాలని కోరినా.. అప్పట్లో పట్టించుకోలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…. ప్రధానంగా నీటి వివాదాల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇటు నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. భవిష్యత్తులో కృష్ణా నీటి పంపకాల విషయంలో ఎలాంటి మొహమాటలకు పోకూడదని భావిస్తోంది. ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలన్న తెలంగాణ డిమాండ్‌పై సీరియస్‌గానే స్పందిస్తోంది జగన్ సర్కార్. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 సంవత్సరానికి 70-30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఇరిగేషన్ ఈఎన్సీ. ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ తెలంగాణ డిమాండ్‌పై అభిప్రాయం అడగ్గా వెంటనే KRMBకి లేఖ రాసింది సర్కార్. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!