ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్.. అయితే, తెలంగాణ కోరుతున్న 50:50 శాతం నీటి కేటాయింపులు పగటి కలే అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కేఆర్ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 71,532 శాంపిల్స్ పరీక్షించగా.. 1,601 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది మృతి చెందారు. చిత్తూరులో ఆరుగురు, తూర్పో గోదావరి, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇదే సమయంలో 1,201 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో…
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్‌తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శ! కేంద్ర కేబినెట్లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తిరుపతి,…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే…
ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు.. ఇదే సమయంలో ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తారు ఏపీ సీఎం వైఎస్ జగన్… ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ పాదయాత్రలు వాయిదా వేసుకుని కూడా విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాలున్నాయి.. కానీ, ఈ మధ్య వైఎస్ జగన్ స్వదేశీ, విదేశీ పర్యటనలకు కాస్త గ్యాప్ వచ్చేసింది.. అయితే, ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ జీవితంలో ఓ స్పెషల్‌డే రానుంది.. అదే జగన్-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు…
ఆ టీడీపీ సీనియర్ నేత ఆంతర్యం ఏంటో పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. రాజీనామా చేస్తానన్న తేదీ దగ్గర పడి ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం దూతలు వచ్చారు.. వెళ్లారు. వారేం మాట్లాడారో.. హైకమాండ్ బుజ్జగించిందో లేదో తెలియదు. దీంతో ఆయన ఉంటారా.. వెళ్తారా అని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఆయనెవరో.. ఆ బుజ్జగింపులేంటో.. ఈ స్టోరీలో చూద్దాం. చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల కాల్ లిఫ్ట్ చేయడం లేదా? టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… వైఎస్ జగన్‌తో పాటు… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి… అయితే, ఆ ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని.. రెండు పిటిషన్లలోనూ ఒకే రకమైన…
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి…
ఏపీలో జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ధారించింది. ఇక మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500 ఇతర గ్రూపులకు రూ.15,000 గా… అలాగే కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000 ఇతర గ్రూపులకు రూ.18,000 గా స్పష్టం చేసింది. అయితే కరోనా కారణంగా గత…