నేడు కుటుంబం తో కలిసి సిమ్లా కు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ జీవితంలో ఓ స్పెషల్‌డే కానుంది.. అదే జగన్-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు మాత్రమే కాదు.. సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్నారు.. వైఎస్ జగన్-భారతి పెళ్లి జరిగి 25 ఏళ్లు కావస్తుంది.. ఈ సందర్భంగా.. రాజకీయాలు, సీఎం బాధ్యతలకు దూరంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీతో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనున్నారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు సిమ్లాకు చేరుకోనున్నారు.. ఐదు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.